వైట్‌ఘట్‌పై ప్రభుత్వం అప్రమత్తం
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:34 AM
రాష్ట్రంలో రొయ్యలకు సోకిన వైట్‌ఘట్ వ్యాధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. శనివారం ’ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ప్రభుత్వం స్పందించి..
రొయ్యల చెరువుల్లో నమూనాల సేకరణ
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రొయ్యలకు సోకిన వైట్‌ఘట్ వ్యాధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. శనివారం ’ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ప్రభుత్వం స్పందించి, మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. వివిధ సంస్థలతో సమన్వయం చేసుకుని, శాస్త్రీయ పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైట్‌ఘట్ వ్యాధి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారులు రొయ్యల చెరువుల్లో నమూనాలు సేకరించారు.