Share News

ఎమ్మెల్యేగా ప్రొటోకాల్‌ ఎక్కడ?

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:59 PM

నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలు పొందిన తనకు అధికారులు ప్రొటో కాల్‌ ఎక్కడా కల్పించడం లేదని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు.

ఎమ్మెల్యేగా ప్రొటోకాల్‌ ఎక్కడ?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విరుపాక్షి

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విరుపాక్షి

ఆలూరు, జూన్‌ 23 (ఆం ధ్రజ్యోతి): నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలు పొందిన తనకు అధికారులు ప్రొటో కాల్‌ ఎక్కడా కల్పించడం లేదని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతికి ఇచ్చిన ప్రొటోకాల్‌ కూడా తనకు ఇవ్వడం లేదన్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన సీఎం, డీఐజీ ఉండడం వల్లే ఎక్కడికి వెళ్లినా ఇద్దరు ఎస్‌ఐలు, ఒక సీఐ వాహనం సైరన్‌ చేసుకుని తీసుకెళ్తున్నారని, ఆమె ఏమైనా మంత్రినా అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న షాడో ఎమ్మెల్యే ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. బీసీ వర్గాలను అణగదొక్కేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ప్రజల కోసం తాను పోలీసులు లేకుండానే గ్రామంలో తిరుగుతున్నానన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:59 PM