రేషనదారులకు గోధుమపిండి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:43 PM
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని రేషన కార్డుదారులకు కిలో గోధుమ పిండిని రూ.20లకే అందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు.
నంద్యాల నూనెపల్లి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని రేషన కార్డుదారులకు కిలో గోధుమ పిండిని రూ.20లకే అందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని బొమ్మలసత్రం వార్డు నంబరు-32లో గల చౌక దుకాణం నం.1384121ను తనిఖీ చేసి, రేషనకార్డుదారులకు గోధుమపిండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. నంద్యాల అర్బన ఏరియాలోని అన్ని చౌక ధరల దుకాణాలలో కూడా గోధుమపిండిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం చౌక దుకాణంలో నిత్యావసర వస్తువుల పంపిణీ విధానాన్ని జేసీ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జ్యోతి రవిబాబు, నంద్యాల సీఎ్‌సడీటీ ఎమ్‌వీఎ్‌సఎస్ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.