Share News

విద్యార్థిని చున్నీ లాగి..!

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:18 AM

ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థిని చున్నీ లాగి అసభ్యకరంగా ప్రవర్తించిన తీరుపై గ్రామస్థులు ఆందోళన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు..

విద్యార్థిని చున్నీ లాగి..!

  • మోగల్లు హైస్కూల్‌ హెచ్‌ఎం అసభ్య ప్రవర్తన, గ్రామస్థుల ఆగ్రహం

పాలకోడేరు, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థిని చున్నీ లాగి అసభ్యకరంగా ప్రవర్తించిన తీరుపై గ్రామస్థులు ఆందోళన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు ఏఎస్ఆర్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధానోపాధ్యాయుడు మోగంటి వెంకట త్రినాథుడు గురువారం పాఠశాల గదిలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని వద్దకు వెళ్లి మెడలో ఉన్న చున్నీని తీసి ఆయన మెడలో వేసుకున్నాడు. ‘ఈ చున్నీ నీ మెడలోకంటే.. నా మెడలోనే బాగుంది’ అనడంతో తరగతిలోని విద్యార్థులంతా పకపకా నవ్వారు. ఆ విద్యార్థిని తీవ్ర అవమానంగా భావించి కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు, గ్రామ పెద్దలు శుక్రవారం పాఠశాలకు వచ్చి హెచ్‌ఎంను నిలదీశారు. విషయాన్ని డీఈవోకు తెలిపి చర్యలు తీసుకుంటామని ఎంఈవో నాగరాజు, డీవైఈవో రమేశ్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Jul 11 , 2026 | 05:21 AM