Share News

సాధారణ రోగిలా వచ్చి.. ఓపీ రాయించుకుని.. ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ చికిత్స..

ABN , Publish Date - May 12 , 2026 | 05:42 AM

ఆమె జిల్లా కలెక్టర్‌.. వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లొచ్చు.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రొటోకాల్‌ పేరిట నే రుగా వైద్యులను కలి సి చికిత్స చేయించుకోవచ్చు.

సాధారణ రోగిలా వచ్చి.. ఓపీ రాయించుకుని.. ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ చికిత్స..

భీమవరం క్రైం, మే 11 (ఆంధ్రజ్యోతి): ఆమె జిల్లా కలెక్టర్‌.. వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లొచ్చు.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రొటోకాల్‌ పేరిట నే రుగా వైద్యులను కలి సి చికిత్స చేయించుకోవచ్చు. కానీ.. పశ్చి మ గోదావరి జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అలా చేయలేదు. సోమవారం కలెక్టరేట్‌లో మెట్లు ఎక్కుతుండగా కాలు బెణకడంతో.. ఆమె ప్రైవేటు ఆస్పత్రికి కాకుండా నేరుగా భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి సాధారణ రోగిలా లైన్‌లో నిలబడి ఓపీ రాయించుకున్నారు. అనంతరం ఆర్థోఫెడిక్‌ విభాగానికి వెళ్లి ఎక్స్‌రే తీయించుకున్నారు. వైద్యులు పరీక్షించి అంతా బాగానే ఉందని చెప్పి 2 రకాల మందులు ఇచ్చారు. అనంతరం ఆమె ఆస్పత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. గతంతో పోలిస్తే సేవలు మెరుగుపడ్డాయని వారు చెప్పడంతో కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - May 12 , 2026 | 07:43 AM