Share News

వారపు సంత కళకళ..

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:33 PM

మండల కేంద్రమైన కోసిగిలో వారపు సంత మంగళవారం కళకళలాడింది.

  వారపు సంత కళకళ..
వారపు సంతకు భారీగా వచ్చిన రైతులు, వ్యాపారులు

పోటెత్తిన కొనుగోలుదారులు

మేత లేక పశువుల విక్రయాలు

ఆవేదనలో అన్నదాతలు

కోసిగి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన కోసిగిలో వారపు సంత మంగళవారం కళకళలాడింది. రేణుకా ఎల్లమ్మ దేవి మైదానంతోపాటు స్థానిక బాలురు ఉన్నత పాఠశాల పరిసరాలు గొర్రెలు, మేకలు, పశువులు, కోళ్ల రాకతో కిక్కిరిసిపోయాయి. వేసవి ప్రారంభం కావడంతో పశుగ్రాస కొరత నెలకొంది. దీంతో రైతులు పశువులను సంతకు తరలించారు. వారపు సంతకు కోసిగి నుంచే కాకుండా ఆదోని, ఎమ్మిగ నూరు, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, కౌతాళం, మంత్రాలయం పెద్దకడుబూరు ప్రాంతాల నుంచి వందలాది మంది వ్యాపారులు తరలివచ్చారు.

పశుగ్రాసం లేక విక్రయిస్తున్నాం

వేసవిలో పశువులకు గ్రాసం లేకపోవడంతో సంతలో వాటిని అమ్మడానికి తీసుకు వచ్చాం. పశురైతుల అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలి.

- నగేష్‌, డి.బెళగల్‌, రైతు

Updated Date - Mar 31 , 2026 | 11:33 PM