Share News

మోడల్‌ సోలార్‌ విలేజ్‌లుగా మారుస్తాం

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:44 AM

జిల్లాలోని గ్రామాలను, ఎస్సీ, ఎస్టీ కాలనీలను మోడల్‌ సోలార్‌ విలేజ్‌లుగా మారుస్తామని ఏపీఎస్పీడీసీఎల్‌ క్వాలిటీ కంట్రోల్‌ సీజీఎం ఆదిశేషయ్య అన్నారు.

   మోడల్‌ సోలార్‌ విలేజ్‌లుగా మారుస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న సీజీఎం

ఏపీఎస్పీడీసీఎల్‌ క్వాలిటీ కంట్రోల్‌ సీజీఎం

నంద్యాల ఎడ్యుకేషన, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామాలను, ఎస్సీ, ఎస్టీ కాలనీలను మోడల్‌ సోలార్‌ విలేజ్‌లుగా మారుస్తామని ఏపీఎస్పీడీసీఎల్‌ క్వాలిటీ కంట్రోల్‌ సీజీఎం ఆదిశేషయ్య అన్నారు. పట్టణంలోని పొన్నాపురంలో కాలనీలో పీఎం సూర్యఘర్‌ ఎస్సీ, ఎస్టీల ఉచిత సోలార్‌ పథకంలో భాగంగా నిర్మించిన సోలార్‌ కనెక్షనను సీజీఎం పరిశీలించారు. నంద్యాల ఎస్‌ఈ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు సీజీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ‘పీఎం సూర్యఘర్‌’లో భాగంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2కేవీతో కూడిన సోలార్‌ రూఫ్‌టాప్‌ సిస్టమ్‌ను పూర్తిగా ఉచితంగా ఏర్పాటుచేస్తామన్నారు. ‘కరెంటోళ్ల జనబాట’లో కూడా పీఎం సూర్యఘర్‌ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పథకాన్ని మరింత వేగవంతం చేసేందుకు బ్యాంకర్లు కూడా పూర్తిగా సహకరించేలా చర్చలు జరుపుతామన్నారు. ఎస్‌ఈ సుభాకర్‌కుమార్‌, ఈఈలు శ్రీనివాసరెడ్డి, భరణీకుమార్‌, శ్రీరాములు, డీఈఈలు రమేష్‌కుమార్‌, రంగస్వామి, ఏఈ రామయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:44 AM