Share News

ఖైదీలను సమస్యలను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:40 AM

ఖైదీలు తమ సమస్యలను జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ దృష్టికి తీసుకువస్తే తక్షణమే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు.

   ఖైదీలను సమస్యలను పరిష్కరిస్తాం
జిల్లా జైలులో ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయాదికారి జి.కబర్ధి

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి

కర్నూలు లీగల్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఖైదీలు తమ సమస్యలను జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ దృష్టికి తీసుకువస్తే తక్షణమే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు. మంగళవారం పంచలింగాలలోని జిల్లా జైలును బోర్డు ఆఫ్‌ విజిటర్‌ సభ్యులు తనిఖీ చేశారు. ఈ బృందంలో ఆయనతో పాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, జేసీ నూరుల్‌ ఖమర్‌, అడిషినల్‌ ఎస్పీ హుశేనపీరా ఉన్నారు. ఈ సందర్భంగా కబర్ధి మాట్లాడుతూ ఖైదీలు అహింస మార్గాన్ని వీడి సత్పవర్తనతో తమ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా ఖైదీలకు అందిస్తున్న భోజన వైద్య సదుపాయాల గురించి ఖైదీలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఖైదీల గదులు జైలులో అందిస్తున్న వసతులు, వంట గది రికా ర్డులను తనిఖీచేసి భోజనాన్ని రుచిచూసి నాణ్యతను పరిశీలించారు. ఈ బృందంలో సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ డీడీ రాధిక, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి, పీడబ్ల్యూడీ ఈఈ విజయరాజు, ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ దీప్తి, జిల్లా ఇండస్ర్టీరియల్‌ ఆఫీసర్‌ అశోక్‌ కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సునీల్‌ రెడ్డి, లీగల్‌ ఎయిడ్‌ న్యాయవాది సులోచన పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:40 AM