రైతు సమస్యలు పరిష్కరిస్తాం : ఆర్డీవో
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:16 AM
ప్రతి రైతు సమస్య పరిష్కరిస్తామని ప త్తికొండ ఆర్డీవో ఓబులేసు అన్నారు.
తుగ్గలి, జూన 3 (ఆంధ్రజ్యోతి): ప్రతి రైతు సమస్య పరిష్కరిస్తామని ప త్తికొండ ఆర్డీవో ఓబులేసు అన్నారు. బుదవారం మండలంలోని జొన్నగిరి జిల్లా పరిషత హై స్కూల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, జొన్నగిరి రెవెన్యూ పరిధిలో రైతు సమస్యలపై వినతులను స్వీకరించారు. దాదాపు 13 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిని ఆనలైనలో పొందుపరిచి ఉన్నతాధికారులకు పంపారు. ముఖ్యంగా రీసర్వేలో రైతులు తమ భూములు కొలతలు రికార్డులో ఉన్న దానికంటే తక్కువగా వచ్చాయని, వాటిని సరిద్దిద్దాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవి, డిప్యూటీ తహసీల్దార్ సుదర్శన, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ రెడ్డి, వీఆర్వోలు కాశీరంగస్వామి, స్వరూప్, నాగేంద్ర, రాజేశ్వరి, రంగన్న, టీడీపీ నాయకులు బాలన్న తదితరులు పాల్గొన్నారు.