అభివృద్ధిని అడ్డుకుంటే సహించం
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:43 PM
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటే సహించబోమని టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి
ఆలూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటే సహించబోమని టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 87 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన రూ.49 లక్షల చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలుగా పని చేశారే తప్పా అభివృద్ధి ఏమాత్రం చేయలేదన్నారు. వారి పార్టీవారికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించేవారన్నారు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా బాధితులను ఆదుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, మార్కెట్‌యార్డు చైర్మన్ బిల్లేకల్ వెంకటేష్, నాయకులు కురువ జయరాం, నగరడోన కిష్టప్ప, వీరనాగప్ప, మండల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.
12 నుంచి హులేబీడు ఉరుసు ప్రారంభం
ఆలూరు రూరల్: మండలంలోని హులేబీడులో ఈ నెల 12 నుంచి నిర్వహించనున్న సయ్యద్‌హీరామోద్దీన్ చిస్తీ రహంతుల్లా సాహెబ్‌వలీ ఉరుసును ప్రశాంతంగా జరుపుకోవాలని టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. సోమవారం ఉరుసు వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. గ్రామపెద్దలు మాట్లాడుతూ ఈనెల 12న గంధం, 13న ఉరుసు, 14న జియారత్ కార్యక్రమాలతో ఉరుసు ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో హులేబీడు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.