మేము వెళ్లం
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:42 PM
జిల్లా వైద్య శాఖలో జరుగుతున్న వ్యవహరాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
పైసలిచ్చాం అంటున్న ఉద్యోగులు
డిప్యుటేషన్లు రద్దు చేసినా అక్కడే తిష్ఠ
సెలవులో వెళ్లండి అని బతిమిలాడుతున్న ఉన్నతాధికారి?
కలెక్టర్ హెచ్చరించినా కనిపించని మార్పు
అవినీతి అక్రమాలకు అడ్డాగా జిల్లా వైద్యారోగ్య శాఖ
జిల్లా వైద్య శాఖలో జరుగుతున్న వ్యవహరాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం వెరసి వైద్యారోగ్య శాఖ అన్నట్లు ఉంది పరిస్థితి. ఆ శాఖ ఉన్నతాధికారి చేసే పనులే అక్కడి సిబ్బంది కూడా ఫాలో అవుతున్నాయి. ఆశాఖలోని ఉన్నతాధికారి అండతో కొందరు వైద్యులు, సిబ్బంది విధులతో పాటు తదితర పనుల్లో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో మరీ దారుణం. కిందిస్థాయి సిబ్బంది ఆఉన్నతాధికారి అండతో వైద్యులను లెక్క చేయడం లేదని సమాచారం.
నంద్యాల, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య శాఖలో జరుగుతున్న వ్యవహ రాలపై తీగ లాగితే డొంక కదులుతోంది. తిమ్మాపురం పీహెచసీ ఆకస్మిక తనిఖీపై సమగ్ర నివేదిక ఆయా ఉద్యోగుల క్యాడర్ల పరంగా ఉన్నతాధికారులకు కలెక్టర్ నివేదిం చినట్లు తెలిసింది. ఈక్రమంలో ఆయా అధికారులు, ఉద్యోగులపై రాబోవు రోజుల్లో ఎలాంటి శాఖ పరమైన చర్యలు ఉంటాయో? అన్న భయం నెలకొంది. వీటికితోడు డిప్యుటేషన్లు గత నెల28న రద్దు చేస్తే ఇప్పటికీ కొందరు వైద్యులు, సిబ్బంది అక్కడే తిష్ఠ వేయడం విమర్శలకు తావిస్తోంది.
నిబంధనలు అతిక్రమించి
‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవలే వరుస కథనాలు రావడంతో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి గత నెల 28న డిప్యుటేషన్లు రద్దు చేశామని ప్రకటించారు. కొందరు సదరు ఉత్తర్వుల ప్రకారం రెగ్యులర్ స్థానాలకు వెళ్లారు. మరికొందరు వైద్యులు, సిబ్బంది నేటికీ నిబంధ నలు అతిక్రమించి డిప్యుటేషన్లు రద్దుచేసినప్పటికి దర్జాగా అక్కడే విధులు ని ర్వహి స్తున్నారు. డిప్యుటేషన స్థానాల కోసం పైసలిచ్చాం కదా? మాకు డిప్యుటేషన రద్దు చేస్తే ఎలా? అని సదరు ఉన్నతాధికారిని నిలదీశారని ఆశాఖ వర్గాల ద్వారా తెలిసింది. మేము వెళ్లం.. ఇక్కడే ఉంటామని మొండికేసి మరీ డిప్యూటేషన స్థానాల్లోనే ఉన్నారని తెలిసింది. ఆ ఉన్నతాధికారి ఏమీ చేయలేక మిన్నుకుండిపోయారని తెలిసింది. వారితో వాదించలేక సమస్య సద్దుమణిగే వరకు కనీసం సెలవులోనైనా వెళ్లండి అని.. సదరు ఉన్నతాధికారి బతిమిలాడారని ఆశాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది.
విధులకు డుమ్మా
రుద్రవరం పీహెచసీలో వైద్యురాలు జ్యోతి రెండేళ్ల నుంచి వివిధ పీహెచసీలో డిప్యు టేషనలో ఉన్నారు. అక్కడ కూడా విధులకు సక్రమంగా వెళ్లడం లేదని తెలిసింది. పైగా సదరు వైద్యురాలికి ఇప్పటికి ఎఫ్‌ఆర్‌ఎస్ లేకపోవడంతో పాటు సదరు ఉన్నతాధికారికి సమీప బంధువు కావడంతో మరింత కలిసి వచ్చినట్లైంది. ఇదే క్రమంలో సదరు వైద్యు రాలు డిప్యుటేషన స్థానాల్లో విధులకు రావడం లేదని అక్కడి సహచర వైద్యుడు ఆశాఖ ఉన్నతాధికారికి ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆశాఖ ఉద్యోగుల ద్వారా తెలిసింది. తాజాగా డిప్యుటేషన్ల రద్దుతో కూడా సదరు వైద్యురాలు రెగ్యులర్ స్థానానికి రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆమె శ్రీశైలం, అహోబిళం బ్రహోత్సవాల డ్యూటీలకు వేసినప్పటికీ వెళ్లలేదని తెలిసింది. ఉయ్యాలవాడ పీహెచసీలో పనిచేస్తున్న వైద్యులు వెంకటసుబ్బయ్య కూడా కొన్ని నెలల నుంచి విధులకు డుమ్మా కొడుతు న్నారు. అతడు కూడా ఆశాఖ ఉన్నతాధికారికి సమీప బంధువు అని తెలిసింది. ఈ లెక్కన వీరిద్దరూ ఉన్నతాధికారి అండతో ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. వీరితో పాటు మరి కొందరు వైద్యులు కూడా ఎఫ్‌ఆర్‌ఎస్ కోసం మాత్రమే అలా డ్యూటీలకు వెళ్లి ఆతర్వాత వారివారి ప్రైవేట్ బిజినెస్‌లు, క్లినిక్‌లు చూసుకుని క్యాష్ చేసుకుంటున్నారని సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే.. జీతం అక్కడ.. పని ఇక్కడ అన్నట్టుగా వారి తీరు ఉంది. ఈక్రమంలో సదరు ఉన్నతాధికారికి ఈ రూపంలో నెలవారి మాముళ్లు అందుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు.
క్యాష్ కొట్టు.. పని పట్టు
క్యాష్ కొట్టు.. పని పట్టు అన్నట్టుగా పరిస్ధితి ఉందని వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల వాదన. వీటితో పాటు అదనంగా ఎస్‌ఆర్‌లు, ఇంక్రిమెంట్‌లు, ఎర్న్‌డు, ఛైల్డ్‌కేర్ సెల వులు తదితర వాటిపరంగా ఆయా ఉద్యోగులకు అవసరమైన సమయాల్లో 98493 63914 సదరు నెంబర్‌కు ఫోనపే కూడా చేయించుకుంటున్నారని తెలిసింది. ఇలా ఎక్కడ పడితే అక్కడ అందిన కాడికి దోచేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
పర్యవేక్షణ లేకపోవడంతోనే..
డిప్యుటేషన్లను రద్దు చేసినప్పటికీ కొందరు నేటికీ రెగ్యులర్ స్థానాలకు వెళ్లలేదు. ఈ లెక్కన ఆశాఖ ఉన్నతాధికారి ఆదేశాలను బేఖాతారు చేసినట్లైంది. పర్యవేక్షణ లేకపోవడంతో పాటు ఆశాఖ ఉన్నతాధికారుల తీరుతో ఎవరికి వారు ఎక్కడిక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఫ గోస్పాడు మండలం దీపగుంట్ల పీహెచసీలో పనిచేస్తున్న ఎఫ్‌ఎనవోను ఏడాది కిందట బ్రహ్మణకొట్కూరు పీహెచసీకి రూ.50వేలు తీసుకుని డిప్యుటేషన వేశారని తెలిసింది. అక్కడ ఇద్దరు ఎఫ్‌ఎనవోలున్నా సదరు ఎఫ్‌ఎనవోను డిప్యుటేషన వేయ డంతో అక్కడ ముగ్గురు ఎఫ్‌ఎనవోలు అయ్యారు. దీపగుంట్లలో మాత్రం ఇప్పటికీ ఒక ఎఫ్‌ఎనవో కూడా లేరని తెలిసింది. సదరు ఉద్యోగితో ఉన్నతాధికారి కర్నూలులోని తమ ఇంట్లో సొంత పనులకు వాడుకుంటున్నారని తెలిసింది.
ఫ ప్యాపిలి పీహెచసీలో పనిచేస్తున్న వైద్యుడు రాహూల్ రెండున్నర నెల నుంచి సెలవులో ఉన్నప్పటికీ అతడి డీడీవో పవర్‌ను యథావిధిగా కొసాగించారు. ఈ లెక్కన సదరు వైద్యుడు సెలవులో ఉన్నాట్టా? లేక విధుల్లో ఉన్నట్టా..? అధికారులకే తెలియాలి. మరి కొంతమంది (నలుగురు వైద్యురాళ్లు) ప్రసూతి సెలవుల్లో ఉన్నా కూడా డీడీవో పవర్‌ను మరో వైద్యులకు మార్చకుండా ఉన్నతాధికారి అలాగే కొనసాగించడం వెనుక అనుమానాలు లేకపోలేదు. ఇదే పీహెచసీలో పనిచేస్తున్న సీహెచవో డిప్యుటేషనపై ఇతర పీహెచసీలో పనిచేస్తోంది. డిప్యుటేషన రద్దుతో కూడా సదరు సీహెచవో రెగ్యు లర్ స్థానమైన (ప్యాపిలి)కి రాలేదు. ఆరా తీస్తే అక్కడి నుంచే అలాగే సెలవులో వెళ్లిందని తెలిసింది.
ఫ చాగలమర్రి పీహెచసీలో ఏడాదిన్నర క్రితం డీడీవోగా డాక్టర్ ఇమ్రాన పని చేస్తున్న సమయంలో పీహెచసీకి చెందిన కొంత అమౌంట్ నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేశారు. ఆ తర్వాత డీడీవోగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ అంజలి ఈవిషయాన్ని గుర్తించి ఆశాఖ ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సదరు వైద్యురా లినే తప్పుబట్టారని తెలిసింది. ఆమె తగిన ఆధారాలతో ఆశాఖ డీహెచ, కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా తాజా పున: పరిశీలన చేశారు. నెలరోజుల కిందట హెచడీఎస్ నిఽధు లను అప్పటి డీడీవో డాక్టర్ ఇమ్రాన దుర్వినియోగం చేశారని చార్జీ మెమో జారీ చేశారు. ఈలెక్కన ఆలస్యంగ్యానైనా ఆవైద్యురాలి నిజాయితీ బయటపడి నట్లైంది.
తమదైన శైలిలో పైరవీలు
వైద్యారోగ్యశాఖలోని కొందరు ఉద్యోగులు యూనియన పేరుతో బదిలీలు, డిప్యు టేషన వ్యవహరాల్లో కీలకంగా వ్యవహరించి తమదైన శైలిలో పైరవీలు చేస్తారని తెలిసింది. ఇదే క్రమంలో ఆశాఖ ఉన్నతాధికారికి కూడా వీరు మధ్యవర్తిత్వం చేస్తారని ఆశాఖ వర్గాల ద్వారా తెలిసింది. అవసరమైతే వైద్యులను కూడా లెక్కచేయరని సమాచారం.
ఫ జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓఉద్యోగి ఆశాఖ ఉన్న తాధికా రితో కలిసి ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు తదితర సిబ్బందికి డిప్యుటేషన, తదితర పనుల కోసం అమ్యామ్యాలు తీసుకుని చక్కపెడుతున్నారని తెలిసింది.