రైతుల నమ్మకాన్ని నిలబెడతాం
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:20 AM
ఉమ్మడి జిల్లా నుంచే గాకుండా పక్క రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు తమ పంట ఉత్పత్తులను కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకువస్తున్నారనీ, వారి నమ్మకాన్ని నిలబెడతామని కర్నూలు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన గోల్కొండ అజ్మితబీ, వైస్ చైర్మన శేషగిరిశెట్టి స్పష్టం చేశారు.
మంత్రి టీజీ భరత ఆదేశాల మేరకు సమష్టి కృషి
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన గోల్కొండ అజ్మితబీ
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా నుంచే గాకుండా పక్క రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు తమ పంట ఉత్పత్తులను కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకువస్తున్నారనీ, వారి నమ్మకాన్ని నిలబెడతామని కర్నూలు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన గోల్కొండ అజ్మితబీ, వైస్ చైర్మన శేషగిరిశెట్టి స్పష్టం చేశారు. సోమవారం చాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. టీజీ భరత ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే కర్నూలు యార్డుకు గుర్తింపు తెచ్చేందుకు అధికారుల సహకారంతో సమష్టి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. సెలక్షన గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి మార్కెట్ యార్డులో చేస్తున్న అభివృద్ధి పనులు, రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ ఏడాది భారీ వర్షాలతో ఉల్లి దెబ్బతిని రైతులు నష్టపోయారనీ కమిటీ కూడా రూ.1.5కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అయినా మంత్రి టీజీ భరత సహకారంతో మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటం రూ.1,200లకు కొనుగోలు చేశామని, మరోవైపు హెక్టారు ఉల్లి పంటకు రూ.50వేలను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఏ మార్కెట్ యార్డులో లేని విదంగా కర్నూలు మార్కెట్ యార్డుకు 13 రకాల పంట ఉత్పత్తులు అమ్మకానికి వస్తున్నాయని సెక్రెటరీ వివరించారు.