జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:46 PM
కూ టమి ప్రభుత్వ హయాంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.
వెనుకబడ్డ ఆలూరు అభివృద్ధికి
సహకారందిస్తాం
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
కమ్యూనిటీ హాల్
నిర్మాణానికి భూమిపూజ
ఆలూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కూ టమి ప్రభుత్వ హయాంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని బెలుగుండు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో రూ. 70లక్షల ఎంపీ నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుం ఠం జ్యోతివాల్మీకి, కురువ కార్పొరేషన్ చైర్మన్లు కప్పట్రాళ్ల బొజ్జ మ్మ, దేవేంద్రప్పతో కలిసి ఎంపీ భూమి పూజ చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలూరు ప్రాంతంలో వే దావతి ప్రాజెక్టు నిర్మా ణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరామన్నారు. కర్నూలు నుంచి బళ్లా రివరకు జాతీయ ర హదారి మంజూరు చేయాలని కూడా కోరామన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చేస్తామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో వర్గాలకు అవకాశం లేకుండా కలిసికట్టుగా పనిచేసి అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. రాబోయే రోజుల్లో వైకుంఠం జ్యోతి సారథ్యంలో టీడీపీ జెండా ఎగుర వేస్తామన్నారు. అనంతరం వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ ఎన్నడూ లేనివిధంగా ఆలూరు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌యార్డు చైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ దళితులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వైకుంఠం శివప్రసాద్, రామచంద్రనాయు డు, కురువ జయరాం, మీనాక్షినాయుడు, రఘుబాబు, వైకుంఠం శ్రీరామ్, ఈరన్న, శీనప్ప, శ్రీరాము లు, వెంకటేష్, దేవేంద్ర, ఆలయ కమిటీ ని ర్వాహకులు శ్రీనివాసరెడ్డి, మల్లి, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.