Share News

నిధులు సాధిస్తాం

ABN , Publish Date - Feb 13 , 2026 | 10:58 PM

ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల పురోగతికి తగినన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాధిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన తుగ్గలి నాగేంద్ర అన్నారు.

     నిధులు సాధిస్తాం
జిల్లా గ్రంథాలయ సంస్థ బడ్జెట్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఛైర్మన తుగ్గలి నాగేంద్ర.,

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన తుగ్గలి నాగేంద్ర

15.13 కోట్లకు ఆమోదం

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల పురోగతికి తగినన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాధిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన తుగ్గలి నాగేంద్ర అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సంస్థ ఛైర్మన తుగ్గలి నాగేంద్ర అధ్యక్షతన గ్రంథాలయ సంస్థ సభ్యులతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థలో సిబ్బంది, పెన్షనర్ల జీత భత్యాలకు రూ.9.65 కోట్లు, కొత్త భవనాల నిర్మాణాలకు, మరమ్మతులకు రూ.3.30 కోట్లు, పాఠకుల కొత్త పుస్తకాల కొనుగోలుకు రూ.1.40 కోట్లు, ఇతర అవసరాలకు రూ.3.75 కోట్లు మొత్తం 15.13 కోట్లు అంచనాలను ఆమోదించారు. బడ్జెట్‌ ఆమోదాన్ని మంగళగిరిలోని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులకు పంపించాలని ఈ సభలో ఆమోదించారు. ఈ సందర్భంగా ఛైర్మన తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ కర్నూలు నగరపాలక సంస్థతోపాటు, ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలు చెల్లించే సెస్సు సక్రమంగా వసూలు చేసి 2026-27 ఆర్థిక సంవత్సరంలో గ్రంథాలయాలకు వినియోగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్‌, వయోజన విద్యశాఖ డీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఈఓ సుధాకర్‌, కార్యక్రమ కన్వీనర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ప్రకాశ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 10:58 PM