Share News

ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:22 PM

పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాల ప్రజలు ఆదోని జిల్లా కావాలన్న ఆకాంక్షను తప్పకుండా నెరవేరుస్తామని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు.

 ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం
నిమ్మరసం ఇచ్చి దీక్షను విరవింపజేస్తున్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు

డిలిమిటేషన అయిన వెంటనే

ఆదోని జిల్లాగా ఏర్పాటు

మంత్రుల నుంచి స్పష్టమైన హామీ

మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

తాత్కాలికంగా దీక్ష విరమణ

ఆదోని అగ్రికల్చర్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి) : పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాల ప్రజలు ఆదోని జిల్లా కావాలన్న ఆకాంక్షను తప్పకుండా నెరవేరుస్తామని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. మంగళవారం పట్టణం కోట్ల కూడలిలో జిల్లా సాధన సమితి 269 రోజులుగా చేస్తున్న రిలే దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, సీనియర్‌ నాయకుడు ఉమాపతి నాయుడు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన డైరెక్టర్‌ రామకృష్ణ, జిందే గిడ్డి శంకర్‌, తేదేపా పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, యువ నాయకుడు మారుతి నాయుడు, రామస్వామితో కలిసి సందర్శించారు. దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతం గా కులాలు, మతాలు, సంఘాలు ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఆదోని జి ల్లా కావాలని 269రోజులు గా దీక్షలు చేయడం అభినందనీయమన్నారు. జి ల్లా సాధన జేఏసీ నాయకులను గతంలో తాము ఇనచార్జి జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరకు తీసుకెళ్లామన్నారు. అప్పటికే జిల్లాల పునర్విభజన జరిగిందని, ఆదోని జిల్లాకు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని నియోజకవర్గాల డీలిమిటేషన అయిన వెంటనే జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇటీవల టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ సైతం ఇదే మాట చెప్పారన్నారు. రెండు మూడు రోజుల్లో పార్లమెంట్‌లో డిలిమిటేషన బిల్లు ఆమోదం పొందితే తప్పకుండా జిల్లాల పునర్విభజన జరుగుతుందన్నారు. అభివృద్ధికి అవసరమైన నిధులు కూడా వస్తాయని స్పష్టం చేశారు. తాత్కాలికంగా తన మాటను గౌరవించి దీక్షను విరమించిన జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కోదండ దేవిశెట్టి ప్రకాష్‌, సుజ్ఞానమ్మ, సుభాష్‌ చంద్రబోస్‌, రామాంజనేయులు, నాయకులు వాల్మీకి వెంకటేష్‌, లక్ష్మీనారాయణ, సంజయ్‌, శివప్ప, మదిరే వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 11:22 PM