Share News

ఆదాయపు వసూళ్ల లక్ష్యం అధిగమిస్తాం

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:11 PM

రాయలసీమ రీజన పరిధిలోని మార్కెట్‌ కమిటీల 2025-26 ప్రభుత్వం నిర్దేశించి ఆదాయపు వస్తువుల లక్ష్యాన్ని మార్చి ఆఖరి నాటికి అధిగమిస్తామని కడప మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లావణ్య పేర్కొన్నారు.

   ఆదాయపు వసూళ్ల లక్ష్యం అధిగమిస్తాం
వసూళ్ల లక్ష్యంపై మార్కెట్‌ కమిటీ సెక్రటరీతో చర్చిస్తున్న కడప మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లావణ్య

జిల్లా మార్కెట్‌ కమిటీల నుంచి రూ. 32.41 కోట్లు

ప్రతి నియోజకవర్గానికి రైతు బజార్‌ ఏర్పాటు

కడప మార్కెటింగ్‌ శాఖ డీడీ లావణ్య

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి) : రాయలసీమ రీజన పరిధిలోని మార్కెట్‌ కమిటీల 2025-26 ప్రభుత్వం నిర్దేశించి ఆదాయపు వస్తువుల లక్ష్యాన్ని మార్చి ఆఖరి నాటికి అధిగమిస్తామని కడప మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లావణ్య పేర్కొన్నారు. బుధవారం ఆమె ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో పర్యటించారు. ఆదాయపు వస్తువుల లక్ష్యంపై సూపర్‌వైజర్లు, సహాయ కార్యదర్శితో సమీక్షించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన జిందే శారదా శంకర్‌ మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. డిప్యూటీ డైరెక్టర్‌ లావణ్య మాట్లాడుతూ జిల్లాలో ఏడు మార్కెట్‌ కమిటీల ఆదాయపు వసూళ్ల లక్ష్యం రూ. 40.40 కోట్లు కాగా ఇప్పటివరకు రూ. 32.41 కోట్లు వసూలు చేశామని తెలిపారు. మార్చి ఆఖరి నాటికి 100 శాతం అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మార్కెట్‌ యార్డ్‌ కార్యదర్శి గోవిందు సహాయ కార్యదర్శి శాంతకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:11 PM