Share News

స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తాం

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:11 AM

రాష్ట్రంలోని బేడ బుడగ జంగం కులస్థులకు రిజర్వేషన కల్పిస్తామని వివిధ, రాజకీయ పార్టీలు చేసిన వాగ్దానాలు అమలు పరచకపోవడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడానికి నిర్ణయించామని బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్‌ తెలిపారు.

స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తాం
మాట్లాడుతున్న బుడగ జంగాల సంఘం నాయకులు

బుడగ జంగాల సంఘం నాయకులు

ఆదోని టౌన, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని బేడ బుడగ జంగం కులస్థులకు రిజర్వేషన కల్పిస్తామని వివిధ, రాజకీయ పార్టీలు చేసిన వాగ్దానాలు అమలు పరచకపోవడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడానికి నిర్ణయించామని బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్‌ తెలిపారు. సోమవారం స్థానిక మండిగిరి ప్రాంతంలోని బుడగ జంగాల కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తరుపున చంద్రబాబు నాయుడు కూడా తక్షణమే జీవో జారీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. షెడ్యూల్డ్‌ కులాల జాబితాలోనే ఉన్న బేడ బుడగ జంగం కులానికి ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి, రాజ్యాంగంలోని రిజర్వేషన చట్టబద్ధత కోసం పార్లమెంటులో బిల్‌ పాస్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంలో కేటాయించిన రిజర్వేషన హక్కులు తమ వారికి సక్రమంగా అందడం లేదన్నారు. అన్ని పార్టీల వారు హామీలకు మాత్రమే పరిమితం కావడం ఎంతో విచారకరమన్నారు. అందుకే నిరసనగా స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణకు నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో ఆదోని డివిజన అధ్యక్షుడు ఈభూది గోవిందు, కన్నయ్య, యూత లీడర్లు మోతే లక్ష్మన్న, సిరిగిరి బాలయ్య, కొండ్ర ఎల్లప్ప, సిరిగిరి జమ్మన్న, నరేష్‌, కిట్టు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:11 AM