Share News

పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:13 AM

పాడి పరిశ్రమ అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పి.మోహన్‌ కోరారు.

 పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న పి. మోహన్‌

జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ పి. మోహన్‌

ఆలూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): పాడి పరిశ్రమ అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పి.మోహన్‌ కోరారు. బుధవారం ఆలూరు నియోజకవర్గ స్థాయి త్రైమాసిక బ్యాంకర్ల సమన్వయ సమావేశం కెనరా బ్యాంక్‌ చి ప్పగిరి శాఖ ఆధ్వర్యంలో ఆలూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పి. మోహన్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ మార్గదర్శకాలు, ఇటీవల నిర్వహించిన డీసీసీ/డీఎల్‌ఆర్‌సీ సమావేశ నిర్ణయాల మేరకు జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాల మాదిరిగానే పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి బ్యాంకులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గొర్రెలు, మేకల పెంపకం, పాడి పశువుల కొనుగోలు, పాల ఉత్పత్తి ఆధారిత జీవనోపాధి కార్యకలాపాలకు విస్తృతంగా రుణాలు మంజూ రు చేయాలని తెలిపారు. అదేవిధంగా సీసీఆర్‌సీ కార్డులు పొం దిన కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని బ్యాంకు మేనేజర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రయోజిత పథకాలైన పీఎంఈజీపీ, పీఎంఎ్‌ఫఎంఈ, పీఎం సూర్యఘర్‌ యోజన తదితర పథకాల అమలులో బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించి అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయాలు కల్పించాలని కోరారు. విద్యార్థులకు విద్యా రుణాలు అందించడంలో బ్యాంకులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సమావేశంలో కెనరా బ్యాంక్‌ చిప్పగిరి సీనియర్‌ మేనేజర్‌ గోవిందరావు, వివిధ బ్యాంకుల శాఖ మేనేజర్లు, డీఆర్‌డీఏ డీపీఎం రెహమాన్‌, వ్యవసాయశాఖ ఏడీ, జె.అంజనయ్య, శివయ్య, లక్ష్మి, ఏపీఎంలు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:13 AM