Share News

ఎన్నికల్లో విజయం దిశగా కృషి చేయాలి

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:15 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే దిశగా ప్రతి నాయకుడు, కార్యకర్తలు కృషి చేయాలని కిసాన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి సూచించారు.

ఎన్నికల్లో విజయం దిశగా కృషి చేయాలి

పార్టీని బలోపేతం చేయాలి

కిసాన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి

నంద్యాల నూనెపల్లి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే దిశగా ప్రతి నాయకుడు, కార్యకర్తలు కృషి చేయాలని కిసాన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి సూచించారు. సోమవారం ఆయన పట్టణంలోని జయంత ఫంక్షన హాలులో బీజేసీ కిసాన మోర్చా జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి అధ్యక్షతన, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమన్వయ సహకారంతో నిర్వహించిన జిల్లా కిసాన మోర్చా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయి నుంచి కమిటీలు నిర్మిస్తూ, గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. సమావే శంలో జోనల్‌ ఇనఛార్జి తిమ్మారెడ్డి, జిల్లా కార్యదర్శి చింతా శరతకు మార్‌రెడ్డి, నాగరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వికసిత భారతే లక్ష్యం

బండిఆత్మకూరు: వికసిత భారతే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సారఽథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ కిసాన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు. సోమవారం మండలంలోని పార్నపల్లె గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో నంద్యాల జిల్లా కిసాన మోర్చా సమావేశం నిర్వహించారు. ముందుగా పెద్దదేవళాపురం గ్రామ శివారులో వెలసిన ఏకశిలా అభయాంజనేయస్వామిని బీజేపీ నాయ కులు దర్శించుకున్నారు. అనంతరం జీరామ్‌జీ చట్టం మేలని కూలీల తో కలిసి ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్ర మం లో కిసానమోర్చా జిల్లా అధ్యక్షుడు బి.సుబ్బారెడ్డి, జోనల్‌ ఇనచార్జి తిమ్మారెడ్డి, కార్యదర్శి శరతకుమార్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:15 AM