ప్రజా పోరాటాలకు అండగా నిలవాలి
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:08 PM
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే సీపీఐకు ప్రజలు చేయూతనివ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడయ్య కోరారు.
పత్తికొండ టౌన, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే సీపీఐకు ప్రజలు చేయూతనివ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడయ్య కోరారు. ఆదివారం మండల పరిధిలోని నలకదొడ్డి గ్రామంలో సీపీఐ గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజలతో విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేళ్ల భారతదేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పోరాటాల పార్టీ సీపీఐను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. వందేళ్ల ప్రస్తానంలో అనేక పోరాటాలు సాగించి ఎన్నో విజయాలను సాధించిన ఉద్యమాల పార్టీ సీపీఐ అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు ప్రజల భాగ్యస్వామ్యం అవసరమన్నారు. కార్యక్రమంలో కారుమంచి, వీరన్న, తిమ్మయ్య, వీరన్న, ఉరుకుందు, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
21వ మహాసభలను జయప్రదం చేయండి
ఆలూరు: ఆలూరులో జరిగే ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభలను జయప్ర దం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డ య్య కోరారు. ఆదివారం పట్టణంలో విరాళాలు సేకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 28న ఆర్టీసీ బస్టాండ్‌లో భారీ బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రామాంజీనేయులు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి రంగన్న, అధ్యక్షులు కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి రమేష్, శాఖ కార్యదర్శి సిద్దు, ముద్దు రంగన్న, పెద్దహోతూరు శాఖ కార్యదర్శి రాముడు, తదితరులు పాల్గొన్నారు.