ఇచ్చినమాటలకు కట్టుబడ్డాం
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:19 AM
ఎన్నికలముందు ప్రజలకు ఇచ్చిన మాటలకు ప్ర భుత్వం కట్టుబడి చేస్తోందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
అటికెలగుండు గ్రామంలో
‘ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం’
పత్తికొండ, జులై 28.(ఆంధ్రజ్యోతి): ఎన్నికలముందు ప్రజలకు ఇచ్చిన మాటలకు ప్ర భుత్వం కట్టుబడి చేస్తోందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పత్తికొండ మండలం అటికెలగుండులో ఎమ్మెల్యే పర్యటించారు. ఇం టింటికి తిరిగి రెండేళ్లకాలంలో కూటమిప్రభు త్వం చేసిన అభివృద్ధిని గురించి ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ వడ్డె పోలన్న, మార్కెట్‌యార్డు మాజీచైర్మన హోటల్‌శ్రీనివాసులు, తెలుగుయువత రాష్ట్రకార్యదర్శి బత్తినిలోక్‌నాథ్, మండల కన్వీనర్ కడవల సుధాకర్, స్థానిక నాయకులు రాజారెడ్డి, రాజశేఖ ర్, బూతకన్వీనర్‌లు సాంబ, మహానంది, మహేశ్వర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇబ్బందులు కలిగించొద్దు
వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని ఈ క్రాప్ నమోదులో ఇబ్బందులు కలిగించొద్దని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వ్యవసాయాధికారికి సూచించారు. నారాలోకేష్ పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు మంగళవారం హోసూరుకు వచ్చిన ఎమ్మెల్యే కేఈకి రైతులు తమ సమస్యలను తెలియజేశారు. ప్రభుత్వం సూచన మేరకు వాతావరణ బీమాను చెల్లించామని, అయితే ఈక్రా్‌పలో పంట వివరాలు నమోదు కాకపోతే పంటబీమాకు అర్హత ఉండదన్నారు. పంటల ఈక్రాప్ విషయంలో అధికారులు పలు షరతులు పెడుతున్నారని తమను ఆదుకోవాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే వ్యయసాధికారికి అక్కడి నుండే ఫోనచేసి మాట్లాడారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మీరు ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.