గొట్టాబ్యారేజీకి జలకళ
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:02 AM
క్యాచ్‌మెంట్‌ఏరియాలో కురిసిన వర్షాల కు వంశధారనదిలో నీటి ప్రవాహ స్వల్పంగా పెరిగింది. దీంతో గొట్టాబ్యారేజీ వద్ద జలకళ సంతరించుకుంది.
హిరమండలం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): క్యాచ్‌మెంట్‌ఏరియాలో కురిసిన వర్షాల కు వంశధారనదిలో నీటి ప్రవాహ స్వల్పంగా పెరిగింది. దీంతో గొట్టాబ్యారేజీ వద్ద జలకళ సంతరించుకుంది. ఆదివారం సాయంత్రానికి బ్యారేజీ రెండు గేట్లు పైకెత్తి దిగువకు 1,440 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎడమ ప్రధానకాలువ ద్వారా 1600 క్యూసెక్కులు, కుడిప్రధాన కాలువ ద్వారా 640 క్యూ సెక్కులు విడిచిపెడుతున్నారు. ఇన్‌ప్లో 3600 వస్తున్నట్లు ఏఈ ఆనంద్ చెప్పారు.