‘వాటర్‌షెడ్’ టెండర్లు ఖరారు
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:01 AM
రాష్ట్రంలోని 59 వాటర్‌షెడ్ల రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీకి సంబంధించిన టెండర్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి.
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 59 వాటర్‌షెడ్ల రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీకి సంబంధించిన టెండర్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. దీంతో త్వరలోనే రైతులకు వాటర్‌షెడ్ పరికరాలు పంపిణీ కానున్నాయి. బుధవారం ఏపీ ఆగ్రోస్‌లో ముఖ్యఅధికారులు, వీడియో కెమేరా సమక్షంలో ఈ టెండర్లు ఖరారు చేశారు. ఎంఎస్ఎంఈ పరిధిలో ఉన్న సరఫరాదారులు ఈ టెండర్లలో ఎంపికయ్యారని ఆగ్రోస్ అధికారులు తెలిపారు. ఎంప్యానల్‌మెంట్ సరఫరాదారుల ఎంపిక విధానం నుంచి ఎల్1 టెండర్ విధానానికి మారడం వల్ల సుమారు రూ.5కోట్ల మేర ప్రభుత్వానికి నిధులు మిగిలాయని ఆగ్రోస్ తెలిపింది.