Share News

Water Resources Department: నామినేషన్‌ పద్ధతిపై రూ.10 లక్షల వరకు పనులు

ABN , Publish Date - Jan 06 , 2026 | 04:56 AM

సాగునీటి ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణ కోసం నామినేషన్‌ పద్ధతిలో ఇప్పటి వరకు రూ.ఐదు లక్షల దాకా...

Water Resources Department: నామినేషన్‌ పద్ధతిపై రూ.10 లక్షల వరకు పనులు

  • ‘ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ’పై జల వనరుల శాఖ నిర్ణయం

అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణ కోసం నామినేషన్‌ పద్ధతిలో ఇప్పటి వరకు రూ.ఐదు లక్షల దాకా విలువైన పనులు అప్పగిస్తున్నారని.. ప్రస్తుతం అంచనా వ్యయం పెరగడంతో ఈ విలువను పది లక్షల రూపాయలకు పెంచాలని సాగునీటి యాజమాన్య సంఘాలు చేసిన అభ్యర్థనపై జల వనరుల శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు నామినేషన్‌ విధానంలో పనులు పది లక్షల దాకా అప్పగించవచ్చంటూ జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచిస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మెమో జారీ చేశారు.

Updated Date - Jan 06 , 2026 | 04:56 AM