ఎల్లెల్సీకి నీరు విడుదల
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:36 PM
తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీకి బోర్డు అధికారులు తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేయడంతో మున్సిపల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాగునీటి కోసమే వాడుకోవాలంటున్న అధికారులు
ఆదోని టౌన, జూలై 17(ఆంధ్రజ్యోతి) : తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీకి బోర్డు అధికారులు తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేయడంతో మున్సిపల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదోని పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే బ సాపురం చెరువులోని నీరు అడుగంటిపోవడంతో 20రోజులకు సరిపడా నీరు మాత్రం ప్రస్తుతం మిగిలింది. 3110 ఎంఎల్ (మిలియన లీటర్) సామర్థ్యం కలిగి ఉన్న బసాపురం చెరువులో ప్రస్తుతం 472 ఎంఎల్ నీరు మాత్రం నిలువ ఉంది. రోజుకు దాదాపు 25 ఎంఎల్ నీటి సరఫరా జరుగుతుండగా ప్రస్తుతం నిలువ ఉన్న నీరు మరో 20 రోజులకు మాత్రం సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. ఎల్‌ఎల్‌సీ కాలువకు విడుద ల అయిన తాగునీరు మరొక రెండు రోజులలోగా ఆదోని పట్టణాని కి చేరుకునే అవకాశం అవకాశాలు ఉండడం తో బసాపురం చెరువును నీటితో నింపుకోవ డం కోసం మునిసిపల్ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నా రు. పంప్ హౌస్‌లో నీటి పంపింగ్ కోసం ఆరు 100 హార్స్ పవర్ మోటార్లను సిద్ధం చేశారు. కరెంట్ కోత సమయంలో పంపింగ్ ఆగిపోకుండా జనరేటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బసాపురం చెరువు ఆనకట్ట బలహీనంగా ఉన్న కారణంగా చెరువులో 75 శాతం దాకా నీటిని నింపుకోవడం కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా తాగునీటిని వృఽథా చేయకుండా సహకరించాలని మునిసిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ కోరారు.