Share News

15 రోజులకోసారి నీళ్లు

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:34 PM

మండల పరిధిలోని నేరణికి గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలైనట్లు గ్రామస్థులు వా పోతున్నారు.

  15 రోజులకోసారి నీళ్లు
గ్రామంలో నీటి కోసం ఎదురు చూస్తున్న మహిళలు

నేరణికిలో మొదలైన తాగునీటి కష్టాలు

పట్టించుకోని అధికారులు

హొళగుంద, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని నేరణికి గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలైనట్లు గ్రామస్థులు వా పోతున్నారు. గ్రామానికి 15 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొళాయిలకు నీటి సరఫరా కాకపోవడంతో ట్యాంకు వద్దకు వెళ్లి తోపుడు బండ్లపై తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు పంచాయతీ అధికారులను వేడుకుంటున్నా ప ట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారు లు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఆర్‌డబ్ల్యూఎ్‌సఏఈ రామ్‌నీలాను వివరణ కోరగా నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 11:34 PM