వ్యర్థాలను శుద్ధి చేయాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:56 PM
పత్తి ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను ఈటీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు.
నంద్యాల రూరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పత్తి ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను ఈటీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం మండల వ్యవసాయ అధికారి ప్రసాద్‌రావుతో కలిసి పలు విత్తనశుద్ధి కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పట్టణ శివారులోని న్యూ వెంకటేశ్వర సీడ్స్, వినాయకఆగ్రో ఇండ్రస్టీ్‌సలో స్టాక్, రిజిస్టర్ పత్రాలను పరిశీలించారు. అనంతరం డీఏవో మాట్లాడుతూ వ్యవసాయశాఖ అనుమతి పొందిన కంపెనీల పత్తి విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేయాలన్నారు. స్టాక్ వివరాలు నోటీస్ బోర్డులో పొందు పరచాలని తెలిపారు. స్టాక్ నిల్వల వివరాలు మండల, జిల్లా వ్యవసాయ అధికారులకు తెలియజేయాలన్నారు. విత్తనచట్టం 1966 ప్రకారం వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.