Share News

వార్డుల రిజర్వేషన్లు ఖరారు

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:48 PM

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.

 వార్డుల రిజర్వేషన్లు ఖరారు

ఆదోని పురపోరుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

ఆదోని, అక్టోబ రు 13 (ఆంధ్ర జ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రిజర్వేషన్ల సమగ్ర వివరాలతో కూడిన గెజిట్‌ను కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి సిరి మంగళవారం ప్రకటించారు.

ఆదోని పట్టణంలో మొత్తం 52 వార్డుల రిజర్వేషన్లు వివరాలిలా ఉన్నాయి.

ఎస్టీ (జనరల్‌) (1): వార్డు 49

ఎస్సీ మహిళ (4): వార్డులు 07, 16, 18, 21

ఎస్సీ జనరల్‌ (5): వార్డులు 19, 32, 33, 35, 37

బీసీ మహిళలు (8): వార్డులు 01, 10, 11, 17, 27, 45, 47, 51

బీసీ జనరల్‌ (8): వార్డులు 08, 15, 31, 36, 42, 44, 48, 50,

మహిళ జనరల్‌ (14): వార్డులు 03, 04, 05, 20, 22, 23, 24, 25, 26, 34, 38, 43, 46, 52

జనరల్‌ (12): వార్డులు 02, 06, 09, 12, 13, 14, 28, 29, 30, 39, 41, 40

ఆదోనిలో వేడెక్కిన రాజకీయం

గెజిట్‌ వెలువడటంతో పట్టణంలో పోలిటికల్‌ హీట్‌ ఒక్కసారిగా వేడెక్కింది. తమ వార్డుల రిజర్వేషన్లు మారడంపై అనేక మంది ఆశావాహులు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకునే పనిలో పడ్డారు. స్థానిక నాయకులు ఇప్పటికే ప్రచార ప్రణాళికలు రూపొందిస్తుండగా, ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలోకి అభ్యర్థులను దించేందుకు కసరత్తు వేగవంతం చేశాయి.

Updated Date - Oct 13 , 2026 | 11:48 PM