వార్డుల పునర్విభజన పూర్తి
ABN , Publish Date - May 18 , 2026 | 11:59 PM
ఆదోని మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన పూరైనట్లు కమిషనర్ నయీమ్ అహ్మద్ తెలిపారు.
24లోగా అభ్యంతరాలుంటే తెలపాలి
మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్
ఆదోని టౌన, మే 18 (ఆంధ్రజ్యోతి) : ఆదోని మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన పూరైనట్లు కమిషనర్ నయీమ్ అహ్మద్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై అధికారులు రూపొందించిన డ్రాప్ట్ నోటిఫికేషనను అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వ సూచనల మేరకు మున్సిపాలిటీ పరిధిలో వార్డుల విభజన కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. దీనిపై ఓటర్లు, వివిఽధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల నుంచి సలహా సూచనలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజన చేశామన్నారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలనుకున్నా ఈనెల 24సాయంత్రం 5 గంటలోపు అధికారులకు రాతపూర్వకంగా ఇవ్వాలని ఆయన సూచించారు. వాటిని పరిశీలించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గడువు దాటిన అనంతరం వచ్చే అభ్యంతరాలను సూచనలను పరిగణనలోకి తీసుకోమన్నారు.