Share News

వైభవం.. లక్ష దీపోత్సవం

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:04 AM

శ్రీశైలంలో లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహిం చారు. కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం భక్తుల కోలాహలం తో సందడి నెలకొంది.

    వైభవం.. లక్ష దీపోత్సవం
శ్రీశైలంలో లక్ష దీపోత్సవం

ఆదిదంపతులకు కార్తీకమాస ప్రత్యేక పూజలు

భక్తులకు దశవిధ హారతుల దర్శనఫలం

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

శ్రీశైలం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహిం చారు. కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం భక్తుల కోలాహలం తో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరించారు. కృష్ణమ్మకు దీపాలను వెలిగించి పసుపు కుంకుమలతో సారెను సమర్పించారు. పరమశివుని దర్శించేందుకు తెలుగు రాషా్ట్రలతో పాటు ఉత్తర, దక్షిణాది రాషా్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీగిరిపై లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతి చేపట్టారు. కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ఉత్సవంగా పుష్కరిణి వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన వేదికపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరిణికి దశవిధ హారతులను ఇచ్చారు. పుష్కరిణికి నాలుగువైపులా లక్షదీపోత్సవాన్ని నిర్వహించి శివసేవకులు భక్తులు దీపాలు వెలిగించారు.దీపాలను వెలిగించుకునేందుకు వీలుగా ఆలయ గంగాధర మండపం, అమ్మవారి ఆలయ వెనక భాగంలో, ఉత్తర మాడవీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈవేడుకలను ఈవో శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన పోతుగుంట రమేశ నాయుడు, ఆలయ పీఆర్‌వో శ్రీనివాసరావు, ఎడిటర్‌ అనిల్‌కుమార్‌, డీఈ శాస్త్రీ, ఏఈవోలు పర్యవేక్షించారు.

Updated Date - Nov 17 , 2026 | 12:04 AM