వీశాట్ 2026 ఫేజ్-1 ఫలితాలు విడుదల
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:32 AM
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వీశాట్ ఫేజ్-1 ఫలితాలను శనివారం విడుదల చేశారు.
గుంటూరు(విద్య), ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వీశాట్ ఫేజ్-1 ఫలితాలను శనివారం విడుదల చేశారు. గుంటూరుతోపాటు హైదరాబాద్‌లోని విజ్ఞాన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంప్‌సలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్, ఫార్మా-డీ ప్రవేశాల కోసం వీశాట్ ప్రవేశ పరీక్ష నిర్వహించినట్టు ఇన్‌చార్జి వీసీ ఆచార్య కేవీ కృష్ణకిశోర్ తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్ 2026 ఫేజ్-1 (విజ్ఞాన్ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ ప్రవేశ పరీక్ష)కు ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ర్టాల నుంచి 61 వేల మంది విద్యార్థులు హాజరుకాగా, 42 వేల మంది అడ్మిషన్‌కు అర్హత సాధించారన్నారు. వీశాట్‌లో 1 నుంచి 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి 50 శాతం, 51 నుంచి 200లోపు వారికి 25 శాతం, 201 నుంచి 2000లోపు వారికి 10 శాతం స్కాలర్‌షి్‌పను నాలుగేళ్లు అందజేస్తామన్నారు. ఈ నెల 22 నుంచి 27 వరకు మొదటి విడత కౌన్సిలింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఇతర వివరాల కోసం విజ్ఞాన్.ఏసి.ఇన్ అనే వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
తొలి పది ర్యాంకర్లు వీరే..
మొదటి ర్యాంకు తిగుళ్ల సాత్విక్, రెండో ర్యాంకు బానోత్ సంజయ్, మూడవ ర్యాంకు పి.మౌని్‌ష, 4వ ర్యాంకు చితితోటి హోషిక్, 5వ ర్యాంకు రాయపూడి జశ్వంత్‌నాయుడు, 6వ ర్యాంకు కె.సాకేత్‌చౌహాన్, 7వ ర్యాంకు దామెర్ల వెంకట సిద్థార్థ రాయ్, 8వ ర్యాంకు గుంటోజు ఉమే్‌షచంద్ర, 9వ ర్యాంకు సంగు భరత్ చంద్రారెడ్డి, 10వ ర్యాంకు ఎం.పూర్ణ చంద్రశేఖర్ సాధించారు.