వీఆర్‌ఏలను ఆర్థికంగా ఆదుకోవాలి: బొప్పరాజు
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:40 AM
చాలీచాలని జీతాలతో జీవిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) వేతనాలు పెంచి ఆదుకోవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.
విజయవాడ (గాంధీనగర్), మార్చి 11(ఆంధ్రజ్యోతి): చాలీచాలని జీతాలతో జీవిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) వేతనాలు పెంచి ఆదుకోవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీఆర్‌ఎ్‌సఏకు అనుబంధంగా ఉన్న ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ సమావేశం విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎనిమిదేళ్లుగా జీతాల పెంపు లేకపోవడం, పదోన్నతులు, తదితర అంశాలపై చర్చించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వై.లక్ష్మణ, సహాయ కార్యదర్శిగా బి.చంద్రమోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిలపరపు మధుబాబు, కోశాధికారిగా కత్తి మనోహర్ రాజన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రహ్మయ్య, ఏపీఆర్‌ఎ్‌సఏ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేశ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ తదితరులు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.