Share News

సేవకు జై కొట్టిన ఓటర్లు

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:42 AM

ఆదోని ఓటర్లు సేవకు పట్టం కట్టారు. రాజకీయ ఆధిపత్యాలకు తెర దించారు.

  సేవకు జై కొట్టిన ఓటర్లు
ర్యాలీలో పాల్గొన్న అభిమానులు

ఆదోని, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆదోని ఓటర్లు సేవకు పట్టం కట్టారు. రాజకీయ ఆధిపత్యాలకు తెర దించారు. పురపోరులో ధనబల కోటను బద్దలు కొడుతూ స్వతంత్ర అభ్యర్థి స్వప్ననాయకర్‌ విజయ ఢంకా మోగించారు. మంగళవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో స్వప్న విజయం సాధించి ఘనంగా సంబరాలు జరుపు కున్నారు. విజయోత్సవంలో జనసేన సీనియర్‌ నాయకుడు మల్లప్ప నాయకర్‌, నూతన నాయకురాలు స్వప్న చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించాయి. ఆదోని పట్టణాభివృద్ధికి, వార్డు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పప్న నాయకర్‌ తెలిపారు.

ఈ గెలుపు ప్రజలదే..

డబ్బే సర్వస్వమని విర్రవీగే వారికి ఆదోని జనాలు ఈరోజు సింహస్వప్నమయ్యారు. ఈ గెలుపు ప్రజలదే అని విజేత స్వప్న నాయకర్‌ భర్త మల్లప్ప అన్నారు. ఇప్పటికీ కాదు మేము ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క రూపాయి కూడా పంచలేదు. కేవలం ప్రజలకు చేసిన సేవనే రిపోర్ట్‌ కార్డుగా చూపిస్తామన్నారు.

భారీ విజయోత్సవ ర్యాలీ

స్వతంత్ర అభ్యర్థి స్వప్న నాయకర్‌ అద్భుత విజయంతో అభిమానులు, మద్దతుదారులు పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ వైభవంగా నిర్వహించారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ భీమా స్‌ సర్కిల్‌ వరకు ఉ త్సాహంగా సాగింది. మద్దతుదారులు ఈలలు, కేరింతలు కొడుతూ రంగులు చల్లుకున్నారు.

Updated Date - Nov 04 , 2026 | 12:42 AM