Share News

వలంటీర్‌ వ్యవస్థ వల్లే ఘోర ఓటమి

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:10 AM

గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి వలంటీర్‌ వ్యవస్థే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి ...

వలంటీర్‌ వ్యవస్థ వల్లే ఘోర ఓటమి

  • పాలనలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రాధాన్యం లేదు

  • ప్రజలకు దూరమయ్యాం: మాజీ మంత్రి అమర్‌నాథ్‌

సబ్బవరం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి వలంటీర్‌ వ్యవస్థే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి శివారు ఒమ్మివానిపాలెంలో పార్టీకి చెందిన పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాలకు చెందిన తాజా మాజీ సర్పంచులను శుక్రవారం సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీ్‌పరాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అమర్‌ హాజరై, మాట్లాడారు. పాలనలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఎటువంటి ప్రాధాన్యం లేకపోవడంతో ప్రజలకు దూరమై, ఓటమి చవిచూశామని చెప్పారు. వలంటీర్‌ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగి, పార్టీకి నష్టం జరిగిందన్నారు. ఈ సమస్యను అధినేత జగన్మోహన్‌రెడ్డి గుర్తించారని, మరోసారి ఇటువంటి పొరపాటు జరక్కుండా చూసుకుంటారని చెప్పారు.

Updated Date - Apr 18 , 2026 | 03:10 AM