Share News

పర్యాటక ప్రాంతంగా విశాఖ పోర్టు

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:18 AM

విశాఖపట్నం పోర్టులో రూ.16 కోట్లతో విహార ప్రదేశం(ప్రొమెనేడ్‌) సిద్ధం చేస్తున్నారు.

పర్యాటక ప్రాంతంగా విశాఖ పోర్టు

  • 16 కోట్లతో పనులు... తుది దశకు

విశాఖపట్నం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టులో రూ.16 కోట్లతో విహార ప్రదేశం(ప్రొమెనేడ్‌) సిద్ధం చేస్తున్నారు. సాధారణ ప్రజలు సముద్రం పక్కన నడుస్తూ పోర్టులోకి వచ్చే నౌకలను చూసేందుకు వీలుగా దీనిని డిజైన్‌ చేశారు. గత ఏడాది జూలైలో కేంద్ర జల రవాణా మంత్రి శర్బానంద సోనోవాల్‌ దీనికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ పనులన్నీ తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలలోనే దీనిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రవేశ రుసుము పెట్టి సందర్శకులను అనుమతించాలని పోర్టు అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Feb 04 , 2026 | 05:19 AM