మూత్రాశయంలో కోడిగుడ్డు లాంటి రాళ్లు
ABN , Publish Date - May 21 , 2026 | 04:56 AM
ఓ వ్యక్తి మూత్రాశయంలో కోడిగుడ్డు పరిమాణంలో ఉన్న ఐదు రాళ్లను విశాఖలోని ‘కిమ్స్’ వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. లాప్రోస్కోపిక్ యూరో అంకాలజిస్ట్...
శస్త్రచికిత్స చేసి తొలగించిన వైజాగ్ కిమ్స్ వైద్యులు
అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం), మే 20 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి మూత్రాశయంలో కోడిగుడ్డు పరిమాణంలో ఉన్న ఐదు రాళ్లను విశాఖలోని ‘కిమ్స్’ వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. లాప్రోస్కోపిక్ యూరో అంకాలజిస్ట్, అండ్రాలజిస్ట్ సందీప్ మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన డి.రామకృష్ణ (51) పొత్తికడుపు నొప్పి, మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈనెల 4న షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు పరీక్షలు చేసి మూత్రాశయంలో కోడిగుడ్డు పరిమాణంలో ఉన్న ఐదురాళ్లను గుర్తించారు. శస్త్రచికిత్స చేశాక రామకృష్ణ పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు. మూత్రం నిల్వ ఉండిపోవడం, అడ్డంకులు, ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడతాయని డా.మహేశ్వరరెడ్డి తెలిపారు.