Share News

సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణించొద్దు

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:25 AM

వైఎస్‌ వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణనలోనికి తీసుకోవద్దని వైఎస్‌ సునీతా రెడ్డి న్యాయవాది గౌతం వాదించారు.

సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణించొద్దు

  • వైఎస్‌ సునీతా రెడ్డి న్యాయవాది వాదన

హైదరాబాద్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణనలోనికి తీసుకోవద్దని వైఎస్‌ సునీతా రెడ్డి న్యాయవాది గౌతం వాదించారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాలని సునీత వేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. సునీత పిటిషన్‌పై కౌంటర్‌ వేసిన నిందితులు.. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తయినందున, మరోసారి విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. అయితే, సీబీఐ సరైన రీతిలో దర్యాప్తు చేయలేదని, సీబీఐ వేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోనికి తీసుకోవద్దని సునీత న్యాయవాది వాదించారు. వాదనల అనంతరం ఈనెల 16కు ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

Updated Date - Jun 09 , 2026 | 05:25 AM