ధార్మిక కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:23 AM
హిందూ సమాజాన్ని జాగృతం చేసి భక్తిభావాన్ని పెంపొందించేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని...
లోకేశ్‌ను కలిసిన విశ్వహిందూపరిషత్ ముఖ్యనేతలు
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): హిందూ సమాజాన్ని జాగృతం చేసి భక్తిభావాన్ని పెంపొందించేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని పరిషత్ ముఖ్యనేతలు మంత్రి లోకేశ్‌కు తెలిపారు. గురువారం రాత్రి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో లోకేశ్‌తో వీరు భేటీ అయ్యారు. లోకేశ్‌ను కలిసిన వారిలో పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త దొరస్వామి, తదితరులు ఉన్నారు.