Share News

అసెంబ్లీకి రాని పార్టీకి ఓట్లు వేయొద్దు!

ABN , Publish Date - Aug 17 , 2026 | 04:27 AM

వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు. అయినా రాకపోతే స్థానిక సంస్థల..

అసెంబ్లీకి రాని పార్టీకి ఓట్లు వేయొద్దు!

  • స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని ఇదే కోరుతాం

  • బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు వెల్లడి

విశాఖపట్నం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు. అయినా రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేయవద్దని ప్రచారం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని ఆ 11 నియోజకవర్గాల ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారని చెప్పారు. జగన్‌ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితే.. తమకు (బీజేపీ) కేటాయించిన సమయంలో కొంత తగ్గించుకొని.. వారికి ఇస్తామని చెప్పారు.

Updated Date - Aug 17 , 2026 | 04:28 AM