విశాఖ జూకు బ్లాక్ పాంథర్
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:30 AM
ఇరు రాష్ట్రాల ఒప్పందం మేరకు విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు అసోం జూ నుంచి అరుదైన జంతువులు వచ్చాయి.
ఆరిలోవ (విశాఖపట్నం), మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇరు రాష్ర్టాల ఒప్పందం మేరకు విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు అసోం జూ నుంచి అరుదైన జంతువులు వచ్చాయి. హిమాలయన్ జాతి నల్ల ఎలుగుబంటి (బ్లాక్ బేర్), నల్లచిరుత (బ్లాక్ పాంథర్), కామన్ చిరుతపులి (కామన్ లియోపార్డ్), ఆసియాటిక్ సింహంతోపాటు ఆసియన్ రకం పామ్‌సివెట్‌ను గురువారం తీసుకొచ్చారు. అలాగే విశాఖ జూ నుంచి కొన్ని జంతువులను అక్కడికి పంపారు.