Share News

రూ.11.54 కోట్ల జీఎస్టీ మోసం

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:02 AM

తప్పుడు ఇన్వాయిస్‌ పత్రాల ద్వారా రూ.11.54 కోట్ల జీఎస్‌టీ ఇన్‌పుట్‌ క్రెడిట్‌ పొందిన విశాఖ వ్యాపారిని సెంట్రల్‌ జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు అరెస్టు చేసి...

రూ.11.54 కోట్ల జీఎస్టీ మోసం

  • విశాఖ వ్యాపారి అరెస్టు

విశాఖపట్నం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): తప్పుడు ఇన్వాయిస్‌ పత్రాల ద్వారా రూ.11.54 కోట్ల జీఎస్‌టీ ఇన్‌పుట్‌ క్రెడిట్‌ పొందిన విశాఖ వ్యాపారిని సెంట్రల్‌ జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విశాఖకు చెందిన ఓ వ్యాపారి రూ.81.25 కోట్ల విలువైన తప్పుడు ఇన్వాయిస్‌లు సృష్టించి రూ.11.54 కోట్ల ఇన్‌పుట్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ చేశాడు. దీనిని సెంట్రల్‌ జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు గుర్తించి కేసు నమోదుచేశారు. విశాఖలోని ఆర్థిక నేరాల న్యాయస్థానంలో హాజరుపరచగా నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు అదనపు కమిషనర్‌ కె.ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Feb 22 , 2026 | 04:04 AM