విశాఖ స్టీల్‌ప్లాంటు ఎస్‌ఎంఎస్-2 విభాగంలో ప్రమాదం
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:43 AM
విశాఖ స్టీల్‌ప్లాంటు స్టీల్‌మెల్ట్‌షాప్ (ఎస్‌ఎంఎస్)-2 విభాగంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది.. విభాగంలోని ఎల్‌డీ-2 కన్వర్టర్-2లో స్లాగ్‌ను స్టాగ్‌పాట్‌లో డంప్ చేస్తుండగా..
ఉక్కుటౌన్‌షిప్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ప్లాంటు స్టీల్‌మెల్ట్‌షాప్ (ఎస్‌ఎంఎస్)-2 విభాగంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది.. విభాగంలోని ఎల్‌డీ-2 కన్వర్టర్-2లో స్లాగ్‌ను స్టాగ్‌పాట్‌లో డంప్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్దిదూరంలో ఉన్న చార్జిమన్ సాయినాథ్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదు. సీఐఎస్ఎఫ్ ఫైర్ సిబ్బంది సంఘటన స్ధలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఉక్కు అధికారులు వివరాలు సేకరించారు.