స్టీల్‌ప్లాంటు ప్రమాదంలో మరో కార్మికుడి మృతి
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:19 AM
స్టీల్‌ప్లాంటులోని స్టీల్ మెల్ట్‌షాప్ (ఎస్‌ఎంఎస్)-1లో గత సోమవారం సంభవించిన ప్రమాదంలో గాయపడిన గోకివాడ సూరిబాబు అనే కార్మికుడు..
ఉక్కుటౌన్‌షిప్/మహా రాణి పేట (విశాఖపట్నం), జూన్ 13 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంటులోని స్టీల్ మెల్ట్‌షాప్ (ఎస్‌ఎంఎస్)-1లో గత సోమవారం సంభవించిన ప్రమాదంలో గాయపడిన గోకివాడ సూరిబాబు అనే కార్మికుడు విశాఖపట్నం సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య పదికి చేరింది. ప్రమాద స్థలంలో ఎనిమిది మంది మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం కందుల పైడిరాజు, శనివారం గోకివాడ సూరిబాబు మృతి చెందారు. ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ కాగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కాగా, సూరిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.