రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది
ABN , Publish Date - May 06 , 2026 | 06:24 AM
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
విశాఖ రైల్వే జోన్‌పై సీఎం చంద్రబాబు
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర ఆశలు సాకారమవుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడం అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు.