Share News

విశాఖ ఐఐఎంకు ప్రపంచ ఖ్యాతి

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:45 AM

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందించే విద్యాలయాల ...

విశాఖ ఐఐఎంకు ప్రపంచ ఖ్యాతి

  • విద్యా సంస్థకు ‘బిజినెస్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌’ గుర్తింపు

సిరిపురం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందించే విద్యాలయాల పనితీరును మదింపుచేసే ‘బిజినెస్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌’ (బీజీఏ) నుంచి విశాఖ ఐఐఎంకు అక్రెడిటేషన్‌ వచ్చింది. ఈ మేరకు గురువారం బీజీఏ ప్రతినిధుల నుంచి ఐఐఎంవీకు సమాచారం అందింది. దేశంలో బీజీఏ గుర్తింపు పొందిన సంస్థల సమూహంలో చేరడంపై విశాఖ ఐఐఎం నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలోని అనందపురం మండలం గంభీరంలో సువిశాలమైన క్యాంప్‌సలో నిర్వహిస్తున్న ఐఐఎంవీలో వివిధ రాష్ర్టాలకు చెందిన విద్యార్థులతోపాటు, విదేశీయులు సైతం చేరుతున్నారు. బీజీఏ నుంచి అక్రెడిటేషన్‌ పొందడం పట్ల విశాఖ ఐఐఎం డైరెక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల భాగస్వామ్యం, అధ్యాపక, అధ్యాపకేతర బృందం సమష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 05:45 AM