నేడు విశాఖలో బైక్ రేసింగ్ ఫైనల్
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:40 AM
రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖపట్నంలో మోటార్ బైక్ రేసింగ్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. ఎంఆర్‌ఎఫ్ మోగ్రిప్ సూపర్‌క్రాస్ ఎఫ్‌ఎంఎస్‌సీఐ చాంపియన్‌షిప్-2025...
రాష్ట్రంలో తొలిసారి
విశాఖపట్నం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖపట్నంలో మోటార్ బైక్ రేసింగ్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. ‘ఎంఆర్‌ఎఫ్ మోగ్రిప్ సూపర్‌క్రాస్ ఎఫ్‌ఎంఎస్‌సీఐ చాంపియన్‌షిప్-2025’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఇప్పటివరకూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. విశాఖలో శనివారం ఫైనల్ రౌండ్ నిర్వహిస్తున్నారు. దీనికోసం వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ముస్తాబైంది. 130 మంది రేసర్లు ఇప్పటికే నగరానికి చేరుకుని శుక్రవారం ప్రాక్టీస్ చేశారు. ఇది అతిపెద్ద టు వీలర్ నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్ అని ఆర్‌ఆర్‌ఆర్ మోటార్‌స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్కిటెక్ట్, శాప్ డైరక్టర్ రాజా మేడిది పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు పోటీలు మొదలవుతాయన్నారు.