Share News

విశాఖలో స్వల్ప భూకంపం

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:43 AM

విశాఖలో ఆదివారం తెల్లవారుజామున స్వల్పంగా భూకంపం వచ్చింది. నగర పరిధిలోని తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, మాధవధార, అల్లిపురం, సింహాచలం, వేపగుంట.

విశాఖలో స్వల్ప భూకంపం

విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): విశాఖలో ఆదివారం తెల్లవారుజామున స్వల్పంగా భూకంపం వచ్చింది. నగర పరిధిలోని తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, మాధవధార, అల్లిపురం, సింహాచలం, వేపగుంట, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్‌, గాజువాక తదితర ప్రాంతాల్లో ఉదయం 5.05 గంటల సమయంలో కొద్దిసేపు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.5గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం విశాఖకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలో మీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించింది. కొన్ని సెకన్లపాటు మాత్రమే భూమి కంపించడంతో చాలా మందికి తెలియలేదు.

Updated Date - Jul 13 , 2026 | 03:44 AM