సాగరతీరంలో యుద్ధ విన్యాసాలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:33 AM
విశాఖ సాగర తీరం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష(ఐఎ్‌ఫఆర్), మిలాన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో...
విశాఖ సాగర తీరం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష(ఐఎ్‌ఫఆర్), మిలాన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి యుద్ధనౌకలు, ట్యాంకులు విశాఖకు చేరుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం పదికిపైగా యుద్ధనౌకలు హార్బర్ వైపు పయనిస్తూ పర్యాటకులకు కనువిందు చేశాయి. అలాగే ఈ నెల 19న ఆర్‌కే బీచ్‌లో సాహస విన్యాసాల ప్రదర్శన నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన రిహార్సల్స్ కూడా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. హెలికాప్టర్ నుంచి తాడు సాయంతో సముద్రంలోని బోట్లపైకి దిగడం, పీ8 ఐ యుద్ధ విమానం వెలుగులు విరజిమ్ముతూ దూసుకెళ్లడం ఆకట్టుకున్నాయి. ఆర్మీకి చెందిన పలు యుద్ధ ట్యాంకులను ఆర్‌కే బీచ్‌లో ప్రదర్శనకు పెట్టారు.
-ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం