గుండెపోటుకు వర్చువల్ చికిత్స!
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:48 AM
అపోలో టెలీహెల్త్ నిర్వహణలోని శ్రీసిటీ మెడికల్ సెంటర్‌లో వర్చువల్ చికిత్స ఒకరి ప్రాణాలను కాపాడింది. జూన్ 1న తిరుపతి జిల్లా శ్రీసిటీలో విధుల్లో..
తిరుపతి(టీటీడీ), జూలై 7(ఆంధ్రజ్యోతి): అపోలో టెలీహెల్త్ నిర్వహణలోని శ్రీసిటీ మెడికల్ సెంటర్‌లో వర్చువల్ చికిత్స ఒకరి ప్రాణాలను కాపాడింది. జూన్ 1న తిరుపతి జిల్లా శ్రీసిటీలో విధుల్లో ఉన్న వ్యక్తికి ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. సహోద్యోగులు అతన్ని శ్రీసిటీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. తక్షణమే చికిత్స అందించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉండటంతో వైద్యులు వెంటనే అపోలో హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ నిపుణులతో వర్చువల్ విధానంలో సంప్రదించారు. వారు రోగి పరిస్థితిని రిమోట్ ద్వారా అంచనా వేసి అత్యవసర చికిత్స నిర్ణయాలపై స్థానిక వైద్యబృందానికి మార్గదర్శకత్వం చేయడం ద్వారా రోగి ప్రాణాలు కాపాడారు.