Krishna District: కోడి పందేల్లో వికృతం!
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:40 AM
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్ల గ్రామంలో.. కోడిపందాల్లో రేగిన చిన్న వివాదం పెద్దదై ఓ వ్యక్తి పీక కోసే వరకు వచ్చింది.
ఒకరి పీక కోసిన ప్రత్యర్థి కుమారుడు.. పెదపారుపూడిలో ఘటన
గుడివాడ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్ల గ్రామంలో.. కోడిపందాల్లో రేగిన చిన్న వివాదం పెద్దదై ఓ వ్యక్తి పీక కోసే వరకు వచ్చింది. శుక్రవారం జరిగిన కోడిపందెంలో గుడివాడలోని ఽధనియాలపేటకు చెందిన అనగాని జగన్నాథంకు, పెదపారుపూడి మండలం భూషణగుళ్లకు చెందిన పానకాలుకు మధ్య చిన్న వివాదం చెలరేగింది. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో పానకాలు కుమారుడు ‘వికృత ఈశ్వర్’ బ్లేడ్‌తో వెనుక నుంచి జగన్నాథం పీకపై కోశాడు. తీవ్ర రక్తస్రామవ్వడంతో జగన్నాథంను చికిత్స నిమిత్తం గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం.